లావా (LAVA) సంస్థ తన కొత్త Probuds Xplore 25° ట్రూ వైర్‌లెస్ (TWS) ఇయర్‌బడ్స్‌ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ ఇయర్‌బడ్స్ ఛార్జింగ్ కేసుపై 1.69 అంగుళాల TFT కలర్ డిస్‌ప్లేను అమర్చారు. దీనివల్ల స్మార్ట్‌ఫోన్ చూడాల్సిన అవసరం లేకుండానే, బ్యాటరీ స్థాయి వంటి సమాచారాన్ని నేరుగా కేసుపైనే తెలుసుకోవచ్చు.
ఈ ఇయర్‌బడ్స్ ప్రత్యేకమైన పాప్-అప్ ఫిడ్జెట్ మెకానిజం డిజైన్‌తో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇందులో 10mm డైనమిక్ డ్రైవర్లను అందించడం వల్ల ఆడియో స్పష్టంగా, బాస్ బలంగా వినిపిస్తుంది. కాల్స్ కోసం క్వాడ్ మైక్రో ఫోన్ సెటప్ మరియు ఎన్విరాన్మెంటల్ నాయిస్ కాన్సలేషన్ (ENC) టెక్నాలజీని ఇందులో పొందుపరిచారు.
గేమింగ్ ప్రియుల కోసం 35ms లో లేటెన్సీ గేమింగ్ మోడ్‌ను కంపెనీ అందించింది. బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో పాటు డ్యూయల్ డివైస్ పేరింగ్ సపోర్ట్ ఉండటంతో, ఒకేసారి రెండు డివైస్‌లకు వీటిని కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే, చెమట లేదా నీటి చినుకుల నుంచి రక్షణ కోసం IPX4 స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కూడా ఇచ్చారు.
పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ ఇయర్‌బడ్స్ 50 గంటల వరకు ప్లేబ్యాక్ అందిస్తాయి. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 4 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ పొందే అవకాశం ఉంది. రూ. 1,999 ధరతో లభించే ఈ ఇయర్‌బడ్స్ కాస్మిక్ బ్లాక్, చార్‌కోల్ గ్రే, ఐవరీ వైట్ రంగుల్లో దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. వీటిపై లావా సంబంధిత Over-the-Counter Replacement (OTCR) సపోర్ట్ కూడా లభిస్తుంది.








