కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రకటన ప్రకారం, భారతీయులకు మాత్రమే పాస్‌పోర్టులు జారీ అవుతున్నప్పటికీ, అది పౌరసత్వానికి అధికారిక రుజువు కాదు. అంతర్జాతీయ ప్రయాణాల కోసం మాత్రమే ఇది ట్రావెల్ డాక్యుమెంట్‌గా పనిచేస్తుందని MEA స్పష్టం చేసింది.

ఇటీవల సుప్రీంకోర్టు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) విచారణలో ఆధార్ కార్డ్ మాత్రమే పౌరసత్వానికి రుజువు కాదని నిర్ధారించింది. ఓటర్ ఐడీ కార్డ్ కూడా పౌరసత్వాన్ని నిరూపించలేదని న్యాయ నిపుణులు తెలిపారు.

1950 జనవరి 26 తర్వాత జన్మించినవారికి స్వయంగా పౌరసత్వం ఉంటుంది. 1987 జూలై 1 తర్వాత జన్మించిన వారికి తల్లిదండ్రుల్లో ఒకరు పౌరుడైతే మాత్రమే పౌరసత్వం లభిస్తుంది. 2004 డిసెంబర్ 3 తర్వాత జన్మించిన వారికి ఇద్దరు తల్లిదండ్రులు భారతీయులై ఉండాలని చట్టం నిర్దేశిస్తుంది.

2025లో దేశవ్యాప్తంగా 1.5 కోట్ల పాస్‌పోర్టులు జారీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం 545 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, 6 వర్కింగ్ డేల్లో పాస్‌పోర్ట్ జారీ చేయడం, 45 నిమిషాల్లో సేవ పూర్తి చేయడం వంటి మెరుగుదలలు నమోదు అయ్యాయి.