వైఎస్ జగన్ తాడేపల్లిలో నిర్వహించే ప్రెస్ మీట్ లో గాదె సాయికృష్ణ మరణం, ఉండవల్లి వద్ద వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాలు జరిపిన దాడి మరియు రాజధాని రైతుల పరామర్శకు వెళ్తున్న క్రమంలో జరిగిన ఘటనలపై స్పష్టమైన స్పందన ఇస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలను ఎగ్గొటడం, వైఎస్సార్సీపీ శ్రేణులపై కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసులు మరియు ప్రజా సమస్యల పై ఆయన వివరణలు ఇస్తారని సమాచారం. రైతులు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులు కూడా ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది.
ప్రెస్ మీట్ లో రాష్ట్రంలోని సమకాలీన అంశాలపై జగన్ స్పందించడం ద్వారా వైఎస్సార్సీపీ పోరాటాలకు కొత్త దిశ ఇస్తారని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఈ సమావేశం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమావేశాలు ప్రారంభించే అవకాశం ఉంది.
తాడేపల్లిలో జరగనున్న ఈ సమావేశం ఏపీ రాజకీయ వాతావరణాన్ని మరింత సున్నితంగా మార్చే అవకాశం ఉంది. ప్రభుత్వం మీద ప్రతిఘటన పెరుగుతున్న సమయంలో జగన్ స్పందన ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది.






