నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్క్రిప్ట్ దశ నుంచే ప్రాజెక్టులో భాగమైన కెమెరామెన్ ఎస్. సౌందరరాజన్, దర్శకుడి విజన్‌తో అందరూ ఉత్సాహం చూపారని, కథను విజువల్‌గా గ్రాండ్‌గా ఆవిష్కరించడానికి ప్లాన్ చేశారని వెల్లడించారు.

తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని పరిశీలించి, శ్రీరంగం, తిరువనంతపురం వైభవాన్ని కలిపి 'శ్రీరంగపురం' అనే పేరుతో సినిమాలో చూపించారని ఆయన వివరించారు. హైదరాబాద్, కేరళ, తమిళనాడు, హిమాలయ ప్రాంతాల్లో చిత్రీకరించిన ఈ సినిమాలో విరాట్ కర్ణ నవంబర్, డిసెంబర్ నెలల్లో తీవ్ర చలిలోనూ, జ్వరంతోనూ అండర్‌వాటర్ సన్నివేశాల్లో నటించారని, ఆర్ట్ డైరెక్టర్ అశోక్ రూపొందించిన సెట్లు నిజ ఆలయ అనుభూతిని కలిగిస్తాయని సౌందరరాజన్ పేర్కొన్నారు.