డ్రీమ్ క్యాచర్ ను కిటికీలు, బెడ్రూమ్లు లేదా బాల్కనీల్లో వేలాడదీస్తారు. ఇది రాత్రి వచ్చే చెడు కలలు మరియు ప్రతికూల శక్తిని బంధించి, ఉదయం సూర్యకిరణాలతో దానిని తొలగిస్తుందని నమ్మకం.

వాస్తు ప్రకారం, ఈ అలంకరణ వస్తువును నైరుతి దిశలో ఉంచకూడదు. ఈ దిశ భూ మూలకానికి చెందినది కావడంతో, తేలికైన వస్తువులు అక్కడ ఉంచడం కుటుంబ సంబంధాలకు ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఈ సూచనలు సంప్రదాయ నమ్మకాలు మరియు ఫెంగ్ షుయ్, వాస్తు విశ్వాసాల ఆధారంగా ఉన్నాయి. వీటికి ఏ శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని వ్యక్తిగత విశ్వాసంగా మాత్రమే పరిగణించాలి.