ఎయిర్‌టెల్ రూ. 200 ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీ, 30GB హై-స్పీడ్ డేటా మరియు అన్‌లిమిటెడ్ 5జీ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్లాట్‌ఫామ్‌పై లయన్స్‌గేట్ ప్లే, సోనీ లివ్, ఆహా ప్రీమియం, చౌపాల్, సన్‌నెక్స్ట్ సహా 18కి పైగా OTT యాప్‌లకు యాక్సెస్ లభిస్తుంది.
ఈ ప్లాన్ ద్వారా రూ. 149 వాల్యూ జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది. దీని ద్వారా లైవ్ స్పోర్ట్స్, సినిమాలు మరియు హాట్‌స్టార్ స్పెషల్స్ వంటి కంటెంట్‌లను మొబైల్‌లో చూడవచ్చు.
30GB డేటా అయిపోతే ప్రతి MBకి 50 పైసల ఛార్జ్ విధిస్తారు. ఈ ప్లాన్ రిలయన్స్ జియో రూ. 200 ఓటీటీ ప్లాన్‌కు పోటీగా నిలుస్తుంది. జియో ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీ, 30GB డేటా మరియు 16 OTT యాప్‌ల యాక్సెస్ ఉంది.
ఎయిర్‌టెల్ ప్లాన్‌లో డేటా అయిపోయిన తర్వాత కూడా 5జీ నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. ఇది 5జీ స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్న వారికి ప్రయోజనం కలిగిస్తుంది.







