వినాయక్‌నగర్ జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. పోలీసులు ప్రతిరోజూ తనిఖీలు చేస్తున్నారు, పట్టుబడిన వాహనదారులకు కోర్టులు రూ.10 వేల వరకు జరిమానా మరియు వారం రోజుల జైలు శిక్ష విధిస్తున్నాయి. కానీ ఇంత కఠినమైన చర్యలు కూడా మందుబాబుల తీరును మార్చలేకపోతున్నాయి.

గతంలో ఈ కేసుల్లో జరిమానా రూ.వెయ్యిగా ఉండేది. ప్రస్తుతం కొత్త అమెండ్మెంట్ యాక్ట్ అమలులోకి రావడంతో జరిమానా రూ.10 వేలకు పెరిగింది. జైలు శిక్ష కూడా వారం రోజుల పాటు విధిస్తున్నారు. అయినా వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడుపుతునే ఉన్నారు.

ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్అలీ పేర్కొన్నట్లు, పోలీసులు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరాలని ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో తరచూ జరిగే రోడ్డు ప్రమాదాలలో మద్యం తాగి వాహనాలు నడపడమే ప్రధాన కారణంగా గుర్తించారు.

సీపీ సాయిచైతన్య రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. పోలీసులకు నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. కానీ ఇప్పటివరకు వాహనదారుల్లో మార్పు ఏమీ రాలేదు.