కేంద్ర ప్రభుత్వం రేషన్ పంపిణీ విధానంలో కీలకమైన మార్పులు తీసుకురావడానికి సిద్ధమైంది. ఇప్పటివరకు కుటుంబ సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా నెలకు 35 కిలోల రేషన్ ఇవ్వడం నిలిపేస్తున్నారు.
కొత్త నియమాల ప్రకారం, అంత్యోదయ అన్న యోజన కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి నెలకు 7 కిలోల చొప్పున మాత్రమే ధాన్యాలు పంపిణీ చేస్తారు. ఇద్దరు సభ్యులు ఉంటే 14 కిలోలు, ఐదుగురు ఉంటే 35 కిలోల వరకు మాత్రమే ఇవ్వబడతాయి. సాధారణ రేషన్ కార్డు ఉన్నవారికి నెలకు 5 కిలోల చొప్పున అదే విధంగా కొనసాగుతుంది.
ఈ మార్పులు ఆహార భద్రతను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి తీసుకురావడం అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నాణ్యమైన ధాన్యాలను సరైన పరిమాణంలో పంపిణీ చేయడం ద్వారా పేదలకు సహాయం చేయడం లక్ష్యం. అయితే, పెద్ద కుటుంబాల్లో సభ్యుల మధ్య అసమానతలు తగ్గించడానికి ఈ చర్యలు తీసుకున్నారని కూడా స్పష్టం చేసింది. ప్రజలు జులై 13 వరకు తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి పంపవచ్చు.








