దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీ స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'ఐ యామ్ గేమ్' సినిమాను ఆగస్టు 20న ఓనం కానుకగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా విడుదలైన పోస్టర్‌లో దుల్కర్ సల్మాన్ అత్యంత స్టైలిష్‌గా కనిపించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం వేఫరర్ ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.