ఐటీ కారిడార్ లోని ఇందిరానగర్ కాలనీలో గత 16 రోజులుగా డ్రైనేజీ సమస్య తీవ్రమైంది. ఇళ్ల మధ్య మురిక్కాల నీరు ప్రవహిస్తున్న ఈ పరిస్థితిలో నివాసితులు బాధపడుతున్నారు.
గచ్చిబౌలి నుంచి ట్రిపుల్ ఐటీ వైపు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్న ఈ కాలనీలో ఈ నెల 9న వచ్చిన భారీ వర్షం తర్వాత డ్రైనేజీ నీటితో కలిసిన వరద నీరు ప్రవహించింది. అంజయ్యనగర్, ఏపీహెచ్‌బీ కాలనీ వంటి నాలుగు ప్రాంతాల నుండి వచ్చే నీటిని ఇటువైపు మళ్లించారని స్థానికులు తెలుపుతున్నారు.
పైపులైన్ పరిమాణం చిన్నదిగా ఉండటం, చెత్త పేరుకోవడం వల్ల మురిక్కాల నీరు రోడ్ల మీదకు వస్తున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. గత ఆగస్టులో కొత్త పైపులైన్ వేయడానికి శంకుస్థాపన చేసినా, ఇప్పటివరకు పనులు మొదలుకాకపోవడంతో పరిస్థితి మరింత దిగజారిందని వారు పేర్కొన్నారు.





