బుధవారం మధ్యాహ్నం కోల్‌కతాలోని తరతలలో వేర్‌హౌస్ నిర్మాణ సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలింది. దాదాపు 50 మంది కార్మికులు పనిచేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు, 15 మంది శిథిలాల కింద ఇరుక్కుపోయారు.
స్థానికులు తక్షణం సహాయక చర్యలు ప్రారంభించారు. పోలీసులు, NDRF, SDRF, సైనికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పటివరకు 21 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. గ్యాస్ కటర్ల సహాయంతో బీమ్‌లను కట్ చేసి మిగిలిన వారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
పశ్చిమ బెంగాల్ CM సువేందు అధికారి ప్రమాద స్థలాన్ని సందర్శించారు. రక్షణ చర్యల వేగాన్ని పెంచాలని అధికారులకు ఆదేశించారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించాలని నిర్దేశించారు.








