ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ నెలాఖరు వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రానున్న 24 గంటల్లో వర్షాలు కురవుతాయని తెలిపారు. పోలవరం, నెల్లూరు, విజయనగరం వంటి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా జూన్ 26న భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

సోవవారం నుంచి మంగళవారం వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం కూనారంలో 17.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. ఫసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.