కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని బూత్ 70 మరియు 71 ప్రాంతాల్లో శనివారం ఒక టీడీపీ నేత ఇంటింటికీ వెళ్లి ఓటర్ సర్వే ఫారాల జిరాక్సులు సేకరిస్తున్నాడు. ఓటర్లు ప్రశ్నించగా, ఆయన బీఎల్వో అని చెప్పి, గతంలో పనిచేసిన బీఎల్వో సరిగా పనిచేయకపోవడంతో తనను పంపారని వివరించాడు.

స్థానికులు ఈ ఘటనపై అనుమానించి వైఎస్సార్సీపీ బీఎల్ఏలకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఆ వ్యక్తిని అడ్డుకుని ఐడీ కార్డు చూపమని డిమాండ్ చేశారు. ఆయన సమాధానం ఇవ్వకుండా నీళ్లు నమిలాడు.

తర్వాత స్థానిక టీడీపీ నేత డిష్ మురళి తనను పంపించాడని ఆయన ఒప్పుకున్నాడు. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు డిష్ మురళిని నిలదీయగా, ఆయన 'మా వాళ్లే వదిలిపెట్టండి' అని చెప్పాడు.

వైఎస్సార్సీపీ నేతలు ఈ ఘటన కళ్యాణదుర్గంలోనే సాగుతోందని, ఫొటోలు మార్చి ఆన్లైన్లో దొంగ ఓట్లు సృష్టించే ప్రయత్నం ఇదని ఆరోపించారు. ఈ విషయంపై స్పందించిన మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య, ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.