కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్యమైన మలుపు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మరో కఠిన పరిస్థితి ఎదురైంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ సంక్షోభంలో ఉన్న సమయంలో, తమ పార్టీ ఫైర్‌బ్రాండ్ మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు కొత్త కమలం రేపాయి.

బీజేపీ నేత సువేందు అధికారిపై తనకు ఉన్న వ్యక్తిగత, భావోద్వేగ అనుబంధాన్ని మహువా మొయిత్రా జాతీయ మీడియా ఇంటర్వ్యూలో బహిర్గతం చేసారు. 2014లో లోక్‌సభ టికెట్ దక్కకపోవడం, 2016 ఎన్నికల్లో సువేందు చేసిన సహాయం గురించి వివరించారు.

ఈ వ్యాఖ్యల వల్ల తృణమూల్ లోపల, మమతా బెనర్జీకి అత్యంత విధేయురాలిగా పేరు తెచ్చుకున్న మహువా మొయిత్రా బీజేపీలో చేరే అవకాశం ఉందనే చర్చలు తీవ్రమయ్యాయి. ఎన్నికల తర్వాత పార్టీ బలహీనపడుతున్న దశలో ఇది కొత్త సవాలుగా మారింది.