అమలాపురం పట్టణ YSRCP సీపీ అధ్యక్షుడు సంసాని వెంకట చంద్రశేఖర్ (బులినాని) గురువారం కలెక్టర్ మహేష్ కుమార్‌కు లిఖిత ఫిర్యాదు చేశారు. కూటమి పార్టీల BLA ఫోన్లలో ఉన్న అనధికార యాప్ ఓటర్లకు ఏ పార్టీకి చెందినవారో, ఎవరికి ఓటు వేస్తారు అనే సమాచారాన్ని రహస్యంగా సేకరిస్తున్నట్లు ఆరోపించారు.
ఈ చర్యల ద్వారా ఓటర్ల డేటా చౌర్యం జరిగిందని, ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాలని బులినాని డిమాండ్ చేశారు. BLA-బీఎల్‌వోల జంటలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల సమాచారాన్ని సేకరిస్తున్నారని, ఇది డేటా దుర్వినియోగానికి దారితీస్తుందని తెలిపారు. ఈ విషయంలో దర్యాప్తు చేయాలని కలెక్టర్‌కు కోరారు.
ఓటర్ల గోప్యతకు ముప్పు కలిగించే ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలని స్థానిక అధికారులను కోరారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఉండాలని ప్రజల్లో అవగాహన కలిగించాలని బులినాని పేర్కొన్నారు.





