ముంబై ఇండియన్స్ స్టార్ హార్దిక్ పాండ్యా త్వరలోనే జట్టు నుండి విడిపోయే అవకాశం ఉంది. ఐపీఎల్ వర్గాల సమాచారం ప్రకారం, ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఫ్రాంచైజీకి పాండ్యాను కొనుగోలు చేయడానికి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాజస్థాన్ రాయల్స్ (RR) ఇప్పటికే ప్రతిపాదనలు చేసాయి.
ముంబై ఇండియన్స్‌లో పాండ్యా తిరిగి వచ్చిన తర్వాత ఆశించిన స్థాయిలో ప్రదర్శన లేకపోవడం, అతని సారథ్యంలో జట్టు ఒకే ఒక్కసారి మాత్రమే ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం ఈ మార్పులకు కారణం. KKR యాజమాన్యం ముంబై యజమానులతో ట్రేడింగ్ విషయంలో చర్చలు జరిపింది. ఈ సీజన్ తర్వాత రహానేని తాత్కాలిక ఏర్పాటని, అతన్ని విడుదల చేయడం ఖాయమని సమాచారం.
KKR జట్టులో పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం KKRకి సరైన నాయకత్వ ప్రత్యామ్నాయం లేకపోవడంతో, RR నుండి యశస్వి జైస్వాల్‌తో మార్పిడి ప్రతిపాదన కూడా ఉంది. అయితే, రాజస్థాన్ రాయల్స్ భవిష్యత్తులో రియాన్ పరాగ్‌ను కెప్టెన్‌గా చూస్తున్నందున, పాండ్యాకు ఆ జట్టులో నాయకత్వం కష్టం. ఐపీఎల్ నియమాల ప్రకారం, ఆటగాడు నేరుగా జట్లతో చర్చలు చేయకూడదు. అతడి అంగీకారం లేకుండా ట్రేడింగ్ సాధ్యం కాదు.







