తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల భద్రతకు ఉచిత ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సింగరేణి కార్మికుల కుటుంబాలకు ఇప్పటికే ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించిన ఉదాహరణను ఉటంకించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం కింద ప్రమాదం జరిగితే ఆర్థిక భరోసా ఇవ్వడానికి బ్యాంకులతో ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఉద్యోగుల కుటుంబాల భవిష్యత్తు కోసం ఇది ముఖ్యమైన అడుగు అని సీఎం నొక్కిచెప్పారు.
ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, ఉద్యోగుల జీతాలు నెల మొదటి తేదీనే చెల్లిస్తున్నట్లు తెలిపారు. 2034 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యాన్ని కూడా ప్రకటించారు.






