హీరోయిన్ సమంత గతేడాది రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న తర్వాత, ఆయన సోదరి శీతల్ అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో రాత్రంతా నిద్రపోకుండా ఆమెకు సేవ చేసిందని శీతల్ బయటపెట్టింది. ఈ విషయాన్ని శీతల్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ, సమంత తన ఆరోగ్యాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుందో వివరించింది.
శీతల్ తెలిపిన వివరాల ప్రకారం, సమంత-రాజ్ పెళ్లయిన కొన్ని రోజుల తర్వాత వారి ఇంటికి వెళ్లిన తనకు ఓ రోజు అర్థరాత్రి వాంతులు, తలనొప్పి రావడంతో మంచం దిగలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఫ్యామిలీ గ్రూప్‌లో సందేశం పెట్టగా, ఉదయం షూటింగ్ ఉన్నా సరే సమంత వెంటనే మందులు, నీళ్లు తీసుకుని వచ్చింది. దుప్పట్లు లేకపోవడంతో టవల్స్ కప్పి, రాత్రంతా నిద్రపోకుండా తన ఆరోగ్యాన్ని గమనిస్తూనే ఉందని శీతల్ పేర్కొంది.
మరుసటి రోజు సమంత సినిమా సెట్‌కు వెళ్లిన శీతల్, చీరలో స్టంట్స్ చేస్తూ నవ్వుతూ కనిపించిన సమంతను చూసి ఆశ్చర్యపోయింది. బ్రేక్ టైంలో తన దగ్గరికి వచ్చి ఆరోగ్యం గురించి అడిగిన సమంత ముఖంలోని ఆందోళన ఇప్పటికీ గుర్తుండిపోయిందని శీతల్ అన్నారు. రాత్రంతా నిద్రపోకుండా ఎలా నటిస్తోందో అనిపించిందని, సినిమాలో ఆ సీన్స్ చూసిన వారికి ఆమె అలసట గానీ, ఆ నవ్వు వెనకున్న సున్నితమైన మనసు గానీ తెలియదని శీతల్ రాసుకొచ్చింది.
గతేడాది పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన సమంత, తాజాగా 'మా ఇంటి బంగారం' సినిమాతో చాన్నాళ్ల తర్వాత తెరపైకి వచ్చి సక్సెస్ అందుకుంది. అయితే సమంత సినిమాలు తాను ఎప్పుడూ చూడలేదని, కానీ ఆమె చేసిన ఈ సహాయం తనకు ఎంతో బాధగా అనిపించిందని శీతల్ ఆ పోస్ట్‌లో పేర్కొంది.








