ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ 2023 మార్చిలో రైసినా డైలాగ్ సమావేశానికి, సెప్టెంబర్లో జీ20 సదస్సు కోసం భారతదేశం సందర్శించారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీ వీధుల్లో ఆమె ఫోటోలతో, 'వచ్చినందుకు ధన్యవాదాలు' అనే సందేశాలతో పోస్టర్లు నిండిపోయాయని మెలోనీ వెల్లడించారు. ఇటలీ ఉప ప్రధానిగా ఉన్న ఆంటోనియో తజానీ ఆ సమయంలో మెలోనీతో జరిగిన సంభాషణలను 'జియోర్జియాస్ విజన్' పుస్తకంలో ప్రస్తావించారు.

మెలోనీ ఢిల్లీలో ఎన్నికల్లో పోటీ చేస్తే లక్షలాది ఓట్లు వస్తాయని తజానీ సరదాగా చెప్పినట్లు ఆమె వివరించారు. ప్రధాని మోదీతో మెలోనీకి మంచి అనుబంధం ఏర్పడింది. వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో ాయని, 'మెలోడీ' హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతున్నట్లు మెలోనీ తెలిపారు.

ఇటీవల ఇటలీ పర్యటనలో మోదీ ఆమెకు 'మెలోడీ' చాక్లెట్లు బహుమతిగా ఇచ్చారు. ఈ వీడియో కూడా వైరల్ అయ్యింది.