సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం, 'కల్కి 2898 AD' తర్వాతి భాగంలో అలియా భట్ భాగస్వామ్యం అయ్యారు. గతంలో ప్రచారం జరిగినట్లుగా ఆమె సుమతి పాత్రను పోషించడం లేదు; బదులుగా చిత్రంలో ఓ ముఖ్యమైన స్పెషల్ రోల్‌లో ఆమె కనిపించబోతున్నారు. ఈ మేరకు ఆమె తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌లో కొంత భాగం పూర్తి చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి.
వర్కింగ్ అవర్స్, రెమ్యునరేషన్ వంటి కారణాలతో మొదటి భాగంలో సుమతిగా నటించిన దీపికా పదుకొనె సీక్వెల్ నుండి తప్పుకున్నారు. ఆమె స్థానంలో స్టార్ క్వీన్ సాయి పల్లవి నటిస్తున్నట్లు సమాచారం. 'ఆర్ఆర్ఆర్' ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అలియా భట్ రాబోయే ఈ విజువల్ వండర్‌లో కనిపించడంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.








