ఇళ్లలో బట్టలు ఉతకడానికి సెమీ-ఆటోమేటిక్, ఫుల్లీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ల మధ్య ఎంచుకోవడం అనేది చాలా మందికి తలనొప్పిగా మారుతోంది.

సెమీ-ఆటోమేటిక్ మెషీన్లలో బట్టలు ఉతకడానికి ఒక టబ్, ఆరబెట్టడానికి మరో టబ్ ఉంటాయి. ఇవి తక్కువ ధరలో లభిస్తాయి. నిరంతరం నీటి సరఫరా అవసరం లేకుండా బకెట్‌తో కూడా నీళ్లు పోయవచ్చు. కానీ, ఉతకిన తర్వాత బట్టలను చేతితో మార్చాల్సి వస్తుంది.

ఫుల్లీ-ఆటోమేటిక్ మెషీన్లు (ముఖ్యంగా ఫ్రంట్ లోడ్) బట్టలను మరింత సమర్థవంతంగా శుభ్రం చేస్తాయి. ఇందులో అడ్వాన్స్‌డ్ వాష్ సైకిల్స్, వేడి నీటి ఫీచర్ ఉంటాయి. బ్యాక్టీరియా పూర్తిగా నాశనం అవుతుంది. కానీ, ఇవి ధరలో ఖరీదైనవి. నిరంతర నీటి ఒత్తిడి, ఎక్కువ విద్యుత్ అవసరం.

మీకు సమయం తక్కువగా ఉండి, తక్కువ శ్రమతో బట్టలు ఉతకాలనుకుంటే ఫుల్లీ-ఆటోమేటిక్ మంచి ఎంపిక. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో, తక్కువ బడ్జెట్‌లో పనిచేయాలనుకుంటే సెమీ-ఆటోమేటిక్‌ను ఎంచుకోవచ్చు.