1985 జూన్ 23న కెనడాలోని టొరంటో నుండి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా 182 విమానం అట్లాంటిక్ సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు పేలుడు జరిగి రెండు ముక్కలైంది. ఈ దుర్ఘటనలో 329 మంది ప్రయాణికులు మరియు సిబ్బంది మరణించారు.
కెనడా ఇంటెలిజెన్స్ సంస్థ సిఎస్‌ఐఎస్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఈ దుర్ఘటనకు ఖలీస్థానీ ఉగ్రవాదులు పూర్తిగా బాధ్యత వహించారని తొలిసారిగా నిర్ధారించారు. నాలుగు దశాబ్దాలుగా ఈ సత్యాన్ని కెనడా ప్రభుత్వం అంగీకరించకపోయినా, ఇప్పుడు వారి పాత్రను గుర్తించారు.
ఈ దుర్ఘటనకు సంబంధించిన ఖలీస్థానీ ఉగ్రవాద సంస్థ బాబర్ ఖల్సా బాధ్యత వహించింది. కెనడా భద్రతా సంస్థలు ఈ సంఘటనను తమ చరిత్రలోని మాయని మచ్చగా పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ దుర్ఘటనకు నివాళిగా కెనడా ప్రభుత్వం ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని నిర్వహిస్తోంది.






