మనీ ప్లాంట్ దట్టంగా పెరగాలంటే కొమ్మల చివరలను క్రమం తప్పకుండా కత్తిరించాలి, ఇలా చేస్తే కొత్త ఉప-కొమ్మలు వచ్చి మొక్క నిండుగా మారుతుంది. పోషకాల కోసం బియ్యం, పప్పులు కడిగిన నీటిని మట్టిలో పోయాలి, అలాగే ఒక లీటరు నీటిలో రెండు చెంచాల పచ్చి పాలు కలిపి ఆకులపై స్ప్రే చేస్తే అవి కాంతివంతంగా మారుతాయి. టీ తాగిన తర్వాత మిగిలిన చాయ్‌పత్తాను కడిగి, ఎండబెట్టి మట్టిలో కలపడం వల్ల ఆమ్లత్వం పెరిగి మొక్క వేగంగా ఎదుగుతుంది.
ఈ మొక్కకు నేరుగా ఎండ తగలకూడదు, కాబట్టి పరోక్ష వెలుతురు ఉన్న ప్రదేశంలో ఉంచడం మంచిది. కుండీలోని మట్టి పైపొర ఎండినప్పుడు మాత్రమే నీరు పోయాలి, అధికంగా నీరు పోస్తే వేర్లు కుళ్ళిపోయే ప్రమాదముంది. కుండీ మధ్యలో మాస్ స్టిక్ లేదా జనపనార కట్టిన కర్రను పెట్టడం వల్ల వేర్లు పైకి పాకి తేమ, పోషకాలు అంది ఆకుల పరిమాణం పెరుగుతుంది.







